జార్జిరెడ్డి ప్రీ రిలీజ్..అతిథిగా పవన్‌

534
pawan
- Advertisement -

జార్జిరెడ్డి… విప్లవ ఉద్యమ కెరటం. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జిరెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన జార్జిరెడ్డిని చాలా చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్థులు క్యాంపస్ లోనే హత్య చేశారు.

ఆయన జీవితచరిత్ర నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో ‘దళం’ సినిమాతో విబిన్నమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్,టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

నవంబర్ 22న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. నవంబర్ 17న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగనుండగా ఈ కార్యక్రమానికి అతిథిగా జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ‘వంగవీటి’ ఫేం సందీప్‌ మాధవ్‌ (సాండి) లీడ్‌ రోల్‌ పోషిస్తుండగా హీరో సత్య దేవ్‌ గెస్ట్‌ రోల్‌ ఫ్లే చేస్తున్నారు. మరాఠీ నటి దేవిక ‘జార్జి రెడ్డి’ తల్లి పాత్రలో కనిపించబోతుంది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.

- Advertisement -