కాచిగూడ రైలు ప్రమాదం…హెల్త్ బులిటెన్

272
care hospital

కాచిగూడ రైలు ప్రమాదం లో అడ్మిట్ అయిన వారి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది కేర్ ఆసుపత్రి. హాస్పిటల్ లో ఇప్పటివరకు ప్రయాణికులు సాజిద్ , శేఖర్ , బేలేశ్వరమ్మ , రాజ్ కుమార్ , మహమ్మద్ ఇబ్రహీం , పైలెట్ చంద్ర శేఖర్ ఉన్నారు.

ప్రయాణికులు శేఖర్ బేలేశ్వరమ్మ, రాజ్ కుమార్ లకు ప్రాక్చర్స్ అయ్యాయని వారికి వైద్యం అందిస్తున్నాం అని చెప్పారు కేర్ హాస్పిటల్ మెడికల్ సూపరిడెంట్. పైలెట్ కండిషన్ రీబ్స్ ప్రాక్చర్స్ అయ్యాయి… కిడ్నీ ఇంజురీ అయిందన్నారు. రెండు కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిపోయింది…వెంటిలేటర్ పై ఉన్నాడు . కండిషన్ క్రిటికల్‌గా ఉందన్నారు.

పైలెట్ చంద్ర శేఖర్ కు శరీరం మొత్తం గాయాలు అయ్యాయి. 24 గంటలు పర్యవేక్షిస్తున్నాము. కండిషన్ క్రిటికల్ గానే ఉంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స అందిస్తున్నామని  చెప్పారు.