టాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా ఉన్న సమంత వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ దూసకుపోతుంది. ఈ అక్కినేని కొడలు ప్రస్తుతం 96 రీమేక్ చిత్రంతో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో ఓ నెగెటివ్ పాత్ర పోషిస్తుందట సమంత. ఆ పాత్ర మరెదో కాదు టెర్రరిస్ట్ అని అంటున్నారు. 10 అనే సినిమాలో కాస్త నెగెటివ్ పాత్ర పోషించిన సమంత మళ్ళీ విలన్ అవతారం ఎత్తలేదు. మళ్లీ ఇంత కాలానికి నెగెటివ్ పాత్ర కనిపిచనుంది.
ఇక ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’.మొదటి సిరీస్‌కు మించి రెండో సిరీస్ రూపొందుతుండగా, ఇటీవలే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలు పెట్టారు. త్వరలోనే సమంత వెబ్ సిరీస్ టీంతో జాయిన్ కానుంది. ఈ ప్రాజెక్ట్‌లో సమంత పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని అంటున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’లో మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైంది. మొత్తం 10 ఎపిసోడ్లతో కూడిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్‌కు ఇప్పుడు సీక్వెల్‌గా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తీస్తున్నారు.