పప్పులాంటి అబ్బాయి సాంగ్ విడుదల చేసిన వర్మ

440
pappulanti abbay
- Advertisement -

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఈమూవీ విడుదలకు ముందే వివాదస్పదంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాల నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించారు వర్మ. ఇప్పటికే విడుదలైన ఈసినిమా టీజర్ పాటలు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరో పాటను విడుదల చేశారు వర్మ. ఈసినిమాలోని పప్పులాంటి అబ్బాయి అనే పాటను కాసేపటి క్రితమే విడుదల చేశారు.

తాజాగా ఈపాటను తన ట్వీట్టర్ ద్వారా షేర్ చేశారు వర్మ. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లులోని పప్పులాంటి అబ్బాయి పాట ఇదిగో.. ఇది తండ్రీకొడుకుల ప్రేమను తెలిపే పాట. ఇందులో తొలి పార్ట్ తండ్రి కోణంలో, రెండో పార్ట్ కుమారుడి కోణంలో ఉంటుంది. ఈ పాత్రలు ఎవరినైనా పోలి ఉన్నాయని మీకనిపిస్తే ఇది కేవలం యాధృచ్ఛికం మాత్రమే’ అని పేర్కొన్నారు. డిసెంబర్ లో ఈసినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు చిత్రయూనిట్.

- Advertisement -