మహేశ్ అల్లుడి కోసం నిధికి ఎంత ఇచ్చారో తెలుసా?

283
ashok Galla Nidhi

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో తెలుగు తెరకె ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమా ఈరోజు ప్రారంభంఅయింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంకి గిబ్రాన్ సంగీతం అందించ‌నున్నారు. అమర్ రాజా మీడియా ఎంటర్టైన్మెంట్ పై ప‌ద్మావ‌తి గ‌ల్లా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంక‌ర్ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌.. అశోక్ స‌ర‌స‌న న‌టిస్తుంది.

కాగా ఈసినిమాలో నిధి అగర్వాల్ కు భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని సమాచారం. డెబ్యూ సినిమా కావడంతో నిధి కూడా భారీగా డిమాండ్ చేసిందట. ఆమె ఈ సినిమా కోసం కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఆమెకు ఆ మొత్తం ఇచ్చేందుకు యూనిట్ ఒకే చెప్పారని తెలుస్తోంది. నిధి అగర్వాల్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.