జనవరి 15న ‘ఎంత మంచి వాడవురా’

500
Enta manchi vadvra
- Advertisement -

నందమూరి కళ్యాణ్‌ రామ్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎంత మంచి వాడవురా. ఇప్పటికే విడుదలైన ఈమూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీని ఉమేష్ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మిస్తుండగా.. కల్యాణ్‌ రామ్ సరసన మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

తాజగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేసింది చిత్రయూనిట్. 2020 జనవరి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈవిషయాన్ని హీరో కళ్యాణ్‌ రామ్ అధికారికంగా ప్రకటించారు. గత కొద్ది రోజులుగా ప్లాప్ లతో సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ ఈసినిమాతో హిట్ కొడతాడొ లేదో చూడాలి మరి.

- Advertisement -