తీర్పు ఎలా వచ్చినా  శాంతి పరిఢవిల్లాలిః మంత్రి కేటీఆర్

338
ktr

అయోధ్యలో రామ మందిరం విషయంలో నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. అయోధ్య స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా వివేకం, శాంతి పరిఢవిల్లాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఆకాంక్షించారు. ఏడాది క్రితం టైమ్స్‌నౌ చానల్ ఇంటర్వ్యూలో తాను వెలిబుచ్చిన అభిప్రాయాన్ని పునరుద్ఘాటిస్తున్నానని ట్విట్టర్‌లో తెలిపారు.

గత ఏడాది నవంబర్ 27వ తేదీన టైమ్స్‌నౌ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన కేటీఆర్.. మందిరం- మసీదుతో పేదలకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. దీనికంటే అవసరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉన్నదని అన్నారు. ఈ మేరకు జర్నలిస్టు నవికాకుమార్ చేసిన ఇంటర్వ్యూ స్క్రీన్‌షాట్‌ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.