యూ ట్యూబ్‌ కింగ్‌….రాహుల్‌ సిప్లిగంజ్‌

650
rahul sipligunz
- Advertisement -

రాహుల్ సిప్లిగంజ్‌…ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది. బిగ్ బాస్‌ 3 విజేతగా నిలవడంతో రాహుల్ పేరు మార్మోగిపోతోంది. రాహుల్ వీకీపీడీయా, రాహుల్ పాడిన సాంగ్స్‌ గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

1989 హైదరాబాద్ దూల్‌ పేటలో పుట్టినరాహుల్‌ జానపద పాటలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. చిన్నప్పటి నుంచే పాటలపై ఉన్న ఇష్టంతో సొంతంగా సాధన చేసిన రాహుల్ కామెడీ పేరడి సాంగ్స్‌తో లోకల్‌గా మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత తాను చేసిన సాంగ్స్‌ను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడంతో సినిమాల్లో పాడే అవకాశాన్ని కొట్టేశాడు.

రాహుల్ పాడిన మాక్కి కిరికిరి సాంగ్‌ ఇప్పటికి డీజే సాంగ్స్‌లో ఎవర్‌గ్రీన్. ఇక 2009లో జోష్ సినిమాలో కాలేజ్ బుల్లోడ పాటతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాహుల్‌ దాదాపు 20కి పైగా సినిమాల్లో పాడాడు.

ఎన్టీఆర్‌ దమ్ము సినిమాలో దమ్ము, వాస్తు బాగుందే, రచ్చ సినిమాలో సింగరేణి ఉంది, ఛల్ మోహన రంగా సినిమాలో పెద్దపులి వంటి పాటలతో గుర్తింపు పొందాడు.2018లో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన రంగస్థలం సినిమాలో రాహుల్ పాడిన రంగ రంగ రంగస్థలానా పాట విశేష ఆదరణ పొందింది.

ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్‌లో వెళ్లే ఛాన్స్‌ దక్కించుకున్న రాహుల్‌ తాను బయట ఎలా ఉంటాడో హౌస్‌లోనూ అలాగే ఉన్నాడు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పి హౌస్‌లో కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిన ప్రేక్షకులు మాత్రం రాహుల్‌నే విజేతగా నిలిపారు. దీంతో రాహుల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇప్పటివరకు కిరాయి ఇంట్లో ఉంటున్నామన్న రాహుల్ బిగ్ బాస్‌ విజేతగా నిలవడంతో వచ్చిన డబ్బుతో సొంత ఇంటిని కొనుగోలు చేస్తానని చెప్పాడు.

- Advertisement -