రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అద్భతమైన స్పందన వస్తోంది. తాజాగా బీజేడీ రాజ్యసభ పక్ష నేత ప్రసన్న ఆచార్య గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు కేశవరావు ఇచ్చిన గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు మూడు మొక్కలు నాటినట్లు ట్వీట్టర్ ద్వారా తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పర్యావరణం దెబ్బతింటు వాతావరణ కాలుష్యం పెరుగుతున్నది. ఇలాంటి సందర్భంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వాములు చేయడం సంతోషకరంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మరోక ముగ్గురికి ఛాలెంజ్ చేయడం జరిగింది. అందులో 1) సస్మిత ప్రతాప్; ఎంపీ రాజ్యసభ 2) విజయ్ పాల్ సింగ్; బిజెపి ఎంపీ రాజ్యసభ 3) అనుభవు మధ్య ఎంపీ; సినీనటుడు నామినేట్ చేశారు.
Accepted #GreenIndiaChallenge from @rao_keshava planted 3 saplings.
I invite @sasmitpatra @vijaypalbjp and @AnubhavMohanty_ to plant 3 saplings & request 3 more to continue the mission. pic.twitter.com/07yJEj4enb— Prasanna Acharya (@prasana_acharya) November 2, 2019