- Advertisement -
ఢిల్లీలోని నిర్మాణ్ భవన్లో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిశారు మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్. ఈసందర్భంగా రాష్ట్రంలోని పలు అంశాల పై కేంద్రమంత్రితో కాసేపు చర్చించారు. తెలంగాణలో శానిటేషన్ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్.
అలాగే తెలంగాణ శానిటేషన్ హబ్ కి 100 కోట్లు ఆర్ధిక సహాయం అందించాలని కోరారు. జిహెచ్ఎంసిలో సాలిడ్ వెస్ట్ మేనేజమెంట్ పథకానికి 400 కోట్లు కేటాయించాలని విజ్నప్తి చేశారు. హైద్రారాబాద్ మెట్రో రైల్ vgf (వైబిలిటీ గ్యాప్ ఫండ్) 254 కోట్లు విడుదల చేయాలని కోరారు. నామమాత్రపు ధరకు బేగంపేట ఎయిర్పోర్ట్ భవనాలను రాష్ట్ర ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు
- Advertisement -