స్వల్పంగా తగ్గిన బంగారం ధర..!

525
gold
- Advertisement -

బంగారం ధర మరోసారి తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.320 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,880కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.320 క్షీణించింది. దీంతో ధర రూ.36,530కు దిగొచ్చింది. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఏకంగా రూ.400 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.46,900,కు దిగొచ్చింది.

gold rate

వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి…

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.39,880, విజయవాడలో రూ.38,400, విశాఖపట్నంలో రూ.39,590, ప్రొద్దుటూరులో రూ.38,450గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,580, విజయవాడలో రూ.35,600, విశాఖపట్నంలో రూ.36,420, ప్రొద్దుటూరులో రూ.35,600గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.46,900, విజయవాడలో రూ.47,800, విశాఖపట్నంలో రూ.47,300, ప్రొద్దుటూరులో రూ.47,300 వద్ద ముగిసింది.

- Advertisement -