మ‌హారాష్ట్ర‌లో శివ‌సేనదే సీఎం పీఠం..!

451
- Advertisement -

అందరూ ఊహించినట్టుగానే మ‌హారాష్ట్ర‌లో బీజేపీ-శివ‌సేన కూట‌మి విజయం సాధించింది. మ‌హారాష్ట్ర అసెంబ్లీ పోరులో బీజేపీ-శివ‌సేన జోడి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే.

స్పష్టమైన ఆధిక్యం సాధించే దిశగా ఈ కూటమి దూసుకుపోతుండడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై తమకు ఉన్న అభిప్రాయాన్ని శివసేన బయటపెట్టింది.వర్లి నుంచి పోటీ చేసిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీని కోరతామని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు.

sivasena

288 సీట్లు ఉన్న మ‌హారాష్ట్ర‌లో.. తాజా స‌మాచారం ప్ర‌కారం బీజేపీ-శివ‌సేన కూట‌మి 167 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.కాంగ్రెస్‌, ఎన్సీపీ జోడి 97 స్థానాల్లో ముందంజ‌లో ఉన్నాయి. మ‌హారాష్ట్ర‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు కావాలి. నిజానికి బీజేపీ-శివ‌సేన కూట‌మి మ్యాజిక్ మార్క్ దాటింది.

అయితే బీజేపీ కూట‌మికి 211 సీట్లు వ‌స్తాయ‌ని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేశాయి. కానీ ఫ‌లితాలు మాత్రం బీజేపీకి కొంత చేదు అనుభ‌వాన్ని మిగిల్చాయి. శివ‌సేన త‌న అన్ని స్థానాల‌ను దాదాపు గెలుచుకున్న‌ది. బీజేపీ మాత్ర‌మే త‌న స్వంత సీట్ల‌ను ఎక్కువ శాతం కోల్పోయింది.

- Advertisement -