హర్యానాలో హంగ్‌…కింగ్ మేకర్‌గా జేజేపీ

472
haryana
- Advertisement -

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. హర్యానాలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పు కాగా ఇక్కడ బీజేపీ పెద్ద పార్టీగా అవతరించినా మేజిక్‌ ఫిగర్ మార్క్‌ను అందుకోలేకపోయింది. 90 స్ధానాలున్న హర్యానాలో మిషన్ 75తో ఆ పార్టీ చీఫ్ అమిత్ షా ప్రచారం నిర్వహించిన ఇక్కడ తిరిగి అధికారంలోకి రావడంలో బీజేపీ విఫలమైంది.

జ‌న‌నాయ‌క్ జ‌న‌తా పార్టీ(జేజేపీ) అనూహ్యంగా.. హ‌ర్యానాలో కీల‌క పార్టీగా ఆవిర్భ‌వించింది. జేజేపీ చీఫ్ దుశ్యంత్ చౌతాలా.. కింగ్‌మేక‌ర్ కానున్నారు. ప్ర‌స్తుతం 10 సీట్ల‌లో జేజేపీ.. ఆధిక్యంలో ఉన్న‌ది. కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో ముందంజ‌లో ఉన్న‌ది. 90 స్థానాలు ఉన్న హ‌ర్యానాలో.. 46 సీట్లు వ‌స్తేనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశాలు ఉంటాయి. కానీ ప్ర‌స్తుతానికి కేవ‌లం 40 స్థానాల్లో మాత్ర‌మే బీజేపీ లీడింగ్‌లో ఉన్న‌ది.

జేజేపీ నాయ‌కుడు దుశ్యంత్ చౌతాలాకు సీఎం పోస్టును ఆఫర్‌గా కాంగ్రెస్,బీజేపీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు హరియాణా బీజేపీ చీఫ్‌ సుభాష్‌ బరాలా తన పదవికి రాజీనామా చేశారు. తొహానాలో ఆయన ఓటమి దిశగా సాగుతున్నారు. సీఎం మనోహార్‌లాల్‌ ఖట్టర్‌ను ఢిల్లీ రావాల్సిందిగా బీజేపీ అధిష్టానం ఆదేశించింది. మరోవైపు కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడాతో ఫోన్‌లో మాట్లాడారు. హంగ్‌ ఏర్పడితే ఏం చేయాలనే దానిపై సోనియా ఆయనతో చర్చించారు.

- Advertisement -