జియో మరో బంపర్ ఆఫర్..

399
- Advertisement -

జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది ఆ సంస్ధ యాజమాన్యం. ఇటివలే జియో అవుట్ గోయింగ్ కాల్ చార్జ్ లు ప్రకటించడంతో వినియోగదారులు కాస్త నిరాశకు లోనయ్యారు. జియో కస్టమర్లు ఇకనుంచి ఇతర మొబైల్ ఆపరేటర్లకు కాల్స్ చేసినప్పుడు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ కింద నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఈ నెల 9 నుంచి అందుబాటులోకి వచ్చింది. అంటే జియో రీచార్జ్ చేయించుకునే కస్టమర్లందరూ నేటి నుంచి ఇతర మొబైల్ ఆపరేటర్ల నెట్ వర్క్‌లకు కాల్ చేసినప్పుడు ఈ ఐయూసీ చార్జ్ కింద ప్రతి నిమిషానికి 6 పైసలు కట్ అవుతుంది.

ఈ ఆఫర్ తో కొంచెం నిరాశ గా ఉన్న వినియోగదారులకు మరో ఆఫర్ ను తిసుకువచ్చింది జియో. జియో ఆల్ ఇన్ వన్ పేరిట 3 ప్లాన్లు ప్రకటించింది. నెలకు రూ.222, రెండు నెలలకు రూ.333, మూడు నెలలకు రూ.444 చొప్పున ఈ ప్లాన్లు ఎంపిక చేసుకోవచ్చు.. ఈ మూడు ప్లాన్లలో రోజుకు 2 జీబీ డేటా లభ్యమవుతుంది. జియో నుంచి జియో నంబర్లకు కాల్స్ ఉచితం. ముఖ్యంగా, ఇతర నెట్ వర్కులకు చేసే కాల్స్ పై 1000 నిమిషాల ఉచిత టాక్ టైమ్ ఆఫర్ చేశారు.

- Advertisement -