మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో వివాదం తారాస్థాయి చేరుకున్నాయి. మా అధ్యక్షుడు నరేష్ పనితీరుపై జీవితా రాజశేఖర్ అసహనం వ్యక్తం చేయడంతో ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. అయాతే ఈ వివాదంపై చర్చించి, సమస్యలు పరిష్కరించుకుందామంటూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ మెంబర్లకు రాజశేఖర్ దంపతులు మెసేజ్ పెట్టారు.
అయితే అధ్యక్షుడు నరేశ్ లేకుండా ఈ సమావేశం ఎలా నిర్వహిస్తారని నరేశ్ తరఫు న్యాయవాది నిలదీస్తున్నారు. ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదని, ఫ్రెండ్లీ సమావేశమనేనని జీవితారాజశేఖర్ చెబుతున్నారు. ఈ రోజు జరిగే సమావేశంలో నరేశ్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని రాజశేఖర్ కార్యవర్గం యోచించినట్లు సమాచారం.
దీంతో మాలో ఉత్కంఠ నెలకొంది. ఇది స్నేహపూర్వక సమావేశమేనని మా ముఖ్య సలహాదారు కృష్ణంరాజు కూడా అంటున్నారు. ఈ సమవేశానికి వచ్చిన వారితో ఎలాంటి సంతకాలు పెట్టించబోమని తెలిపారు.నేడు జరగనున్న సమావేశంలో నరేష్ 9 నెలల్లో చేసిన పనులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న రూ. 5.5 కోట్లనే నరేష్ ఖర్చు చేస్తున్నారని, మూలధనంలో రూపాయి కూడా జమ చేయలేదని సభ్యులు ఆరోపిస్తున్నారు.