ఎన్టీఆర్ అన్న మాట సమస్యగా మారింది- జీవిత రాజశేఖర్

16

‘మా’ ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతుంది. అక్టోబర్‌ 10న జరిగబోయే ఈ ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానల్స్ ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందిన సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గురించి జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ… ఇటీవల ఎన్టీఆర్‌ను కలిసినప్పుడు ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదని చెప్పారు.

అయితే ఇదే విషయంపై మంచు విష్ణు ఓ ఛానల్ లైవ్ షోలో మాట్లాడుతూ,ఎన్టీఆర్ తనకు ఓటు వేస్తానని హామీ ఇచ్చారన్నాడు. దీంతో జీవిత తను మీడియాతో చెప్పిన మాటలను వెనక్కి తీసుకుని, ఎన్టీఆర్‌కు క్షమాపణలు చెప్పారు. తను ఎన్టీఆర్ నిరాసక్తత గురించి చెప్పిన విషయం మా మెంబర్లను తప్పుదోవ పట్టిస్తుందని అంగీకరించారు. ఎన్టీఆర్ కాజువల్‌గా చర్చించిన విషయాలను తను మీడిమా ముందు వెల్లడించటం సమస్యగా మారిందని జీవిత అంగీకరించారు. మా లో నెలకొని ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత బాధగా ఉందని ఎన్టీఆర్ చెప్పారని, తనని ఓటు వేయమని అభ్యర్థించినప్పుడు తను ఏమీ చెప్పలేదన్న సంగతిని వివరించారు జీవిత.