జొన్నలబొగుడ రిజర్వాయర్ ఎత్తుపెంచాలి:నిరంజన్ రెడ్డి

487
minister singireddy
- Advertisement -

జొన్నలబొగుడ రిజర్వాయర్ ఎత్తుపెంచాలని అధికారులకు సూచించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ హాకా భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సింగిరెడ్డి… నూతన రిజర్వాయర్ల టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టండన్నారు. వనపర్తి పరిధిలోని రిజర్వాయర్ల పనులు ప్రారంభించండన్నారు.

డి 82 కాలువ పనులు వెంటనే పూర్తి చేసి ఓటీఎస్ పనులు కూడా తొందరగా పూర్తి చేయాలన్నారు. బుద్దారం కుడి, ఎడమ కాలువల కింద డిస్ట్రిబ్యూటరీ కాలువల సర్వే పూర్తిచేసి పనులు ప్రారంభించాలన్నారు. బుద్దారం ఎడమకాలువ రాజాపేట వరకు పొడిగించాలన్నారు.

లింగాల సమీపంలో కాలువ పనులు పూర్తి చేయాలి… డి 82 కింద అచ్చంపేట నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలన్నారు. ప్యాకేజీ 29,30 లలో పనులు పూర్తికావాలి..వంగూరు మండలానికి త్వరగా నీళ్లు ఇవ్వాలి .. అవసరం అయితే సొంత డబ్బులు ఖర్చు పెడతానన్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.

డి5 కాలువను వెడల్పు చేసి ఏదుల రిజర్వాయర్‌ నింపాలి.. ఖాన్ చెరువుకు నీళ్లిచ్చే ఎంజె4 కాలువ పనులు పూర్తిచేయాలన్నారు. ఎంజె 3 కాలువను శ్రీనివాసపూర్ వరకు పొడిగించాలి.. వనపర్తి ఈదుల చెరువుకు నీరందించాలన్నారు. నీటిని ఎవరు వృధా చేసినా సహించం .. కాలువలు తెంపిన వారు టీఆర్ఎస్ పార్టీ అయినా పోలీసులకు ఫిర్యాదు చేయండన్నారు.కేఎల్ఐ ప్రధానకాల్వ పనులు ముందుగా చూడండి.. రబీ తరువాత మిగిలిన భూసేకరణ పూర్తిచేయండన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, ఈఎన్సీ మురళీధర్, సీఈ విజయకరణ్ రెడ్డి, ఎస్ఈ అంజయ్య, ఈఈలు రమేష్, సంజీవరావు , డీఈ చంద్రునాయక్, సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -