నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

385
New liquor policy
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో మద్యం సిండికేట్లను నిలువరించడానికి మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం.నవంబర్ 1,2019 నుంచి మొదలయ్యే మద్యం షాపుల్లో,క్రయ విక్రయాల కోసం కఠిన నిబంధనలు అమలు చేయనుంది ప్రభుత్వం. ఏ4 మద్యం షాపుల టెండర్ల ప్రక్రియలో సిండికేట్‌గా ఏర్పడేందుకు దరఖాస్తుదారులను మరికొందరు కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ దృష్టికి వచ్చింది. దీంతో మద్యం సిండికేట్ల రూపంలో,ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా,అనైతిక మార్గాల్లో మద్యం వ్యాపారం చేసే వాళ్ళపై కఠిన చర్యలకు రంగం సిద్దం చేసింది ఎక్సైజ్ శాఖ.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, లైసెన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తెలంగాణా ఎక్సైజ్ చట్టం సెక్షన్ 36 బీ, 41 ల ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నారు. కాగా మద్యం వ్యావపారులు ఎంఆర్‌పీ కంటే తక్కువ రేట్లకు మద్యం అమ్మితే చట్ట ప్రకారం 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు జైలుశిక్ష, ₹1 వెయ్యి జరిమానా,ఎక్సైజ్ శాఖ తరఫున మరో ₹2 నుంచి 3 లక్షల అపరాధ రుసుము కట్టే విధంగా నిబంధనలు రూపొందించారు ఎక్సైజ్ అధికారులు.

- Advertisement -