సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ ఉచితంగా ఆవులను అందిస్తున్నామని చెప్పారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న 200 మంది రైతులకు పాడి పశువుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ పంపిణీ చేసిన ఆవులను తల్లిలాగా చూసుకోవాలన్నారు. ఆవును అమ్మినా, నిర్లక్ష్యంగా వ్యవహరించాలని చర్యలు తప్పవని చెప్పారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ఈ ప్రోత్సహం నిరంతరం కొనసాగుతుందని…. రైతుబజార్‌లో సేంద్రియ ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తాం అన్నారు.
సేంద్రియ పంటల విక్రయానికి ప్రత్యేక యాప్ ఏర్పాటు చేసి అందులో రైతుల పూర్తి వివరాలు పొందుపరుస్తామని తెలిపారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహకాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.