సిద్దిపేట తెలంగాణ భవన్ నిర్మాణం పూర్తి

595
- Advertisement -

సిద్దిపేట జిల్లా తెలంగాణ భవన్ నిర్మాణం పూర్తయిందని తెలిపారు మంత్రి హరీష్ రావు. త్వరలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. ఇవాళ తెలంగాణ భవన్‌ను పరిశీలించిన ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం తెలంగాణకే మోడల్‌గా నిలవనుందన్నారు.

పార్టీ అధినేత , సీఎం కేసీఆర్ ఆదేశాలకు వారు చెప్పిన సమయానికి 3నెలలో పనులు చేపట్టామని ప్రారంబానికి సిద్ధం అయిందన్నారు. షేడ్ నిర్మాణ పనులు , ప్రహరి గోడ నిర్మాణ పనులు పూర్తి , భవనం చుట్టూ మొక్కలు నాటాడం తో పచ్చదనంగా, విశాలంగా ఉందన్నారు. ఈ సందర్భంగా నిర్మాణం చేపట్టడం లో పని చేసిన నిర్వహకులను అభినందించారు.

సిద్దిపేట శివారులోని పొన్నాల సమీపంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని దాదాపు రూ. 60 లక్షలతో నిర్మించారు. గ్రౌండ్ ప్లోర్ తో పాటు మొదటి అంతస్థు తో కార్యాలయ భవన్ నిర్మాణం ఉండనుంది. 1500 మంది పార్టీ శ్రేణులు మిటింగ్ లో పాల్గొనేలా మిటింగ్ హల్ అద్బుతంగా నిర్మాణం జరిగింది. విశాలమైన పార్కింగ్ , మోడల్ కిచెన్ షేడ్, టాయిలెట్స్ నిర్మాణం చేపట్టారు.

siddipet ts bhavan siddipet ts bhavan siddipet ts bhavan

- Advertisement -