బుల్లితెరపై పాపులర్ యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారి రాజు గారి గది సీక్వెల్స్‌తో మంచి పాపులర్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఈ సీరిస్‌లో ఇప్పుడు రాజు గారి గది 3 సినిమా తెరకెక్కించిన ఓంకార్ ఈ సినిమా హిట్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓంకార్ తెరకెక్కిస్తున్న చిత్రం రాజు గారి గది 3. ఈ సినిమాకు సంబంధించి ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
‘నా గది లోకి రా’ అంటూ సాగే ఈ పాట మాస్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపడం ఖాయం. ఇదివరకు ఐటెం సాంగ్ అంటే సిల్క్ స్మిత లాంటి వాళ్ళు చేసేవారు. కానీ ఇప్పుడు ఐటెం సాంగ్ లు అన్నీ మన స్టార్ హీరోయిన్స్ చేసేస్తున్నారు. ఆ ఐటెం సాంగ్స్ లో హీరోయిన్లను చూస్తున్న జనాలకు అది ఐటెం సాంగ్ లా అనిపించట్లేదు. అది కూడా రొటీన్ సాంగ్ లానే చూస్తున్నారు. ఇప్పుడు ఒక మంచి ఐటెం సాంగ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ టైములో ఓంకార్ విడుదల చేసిన ఈ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది.