దాదాకు శుభాకాంక్షాలు తెలిపిన దీదీ

475
saurav didi
- Advertisement -

టీంఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా నియామకం ఖరారైనట్లు తెలుస్తుంది. బీసీసీఐ సభ్యత్వం ఉన్న రాష్ట్ర క్రికెట్ సంఘాలు తాజాగా ముంబయిలో సమావేశమై.. అధ్యక్షుడిగా దాదా పేరుని ఖారారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయిన గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా తాను ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు.

శ్రీనివాసన్‌కి అనచరుడిగా ఉన్న బ్రిజేస్ పటేల్ నుంచి గంగూలీకి గట్టి పోటీ ఏర్పడిన చివరకు పైచేయి సాధించాడు. ఏకపక్షంగా బీసీసీఐ అధ్యక్షుడిగా ఏన్నికైన గంగూలీకి శుభాకాంక్షాలు తెలిపారు పశ్బిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మీ ప‌ద‌వీ కాలం ఉత్త‌మంగా సాగాల‌ని కోరుకుంటున్న‌ట్లు మమతా ట్వీట్ చేశారు. ఇప్పటికే బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగా రెండో సారి పదవి బాధ్యతలు చేపట్టారు గంగూలీ.

- Advertisement -