దేశం లో అస్ట్రాలాజి కి చాలా గౌరవం ఉంది

309
harish rao
- Advertisement -

మన దేశంలో అస్ట్రాలాజి కి , జ్యోతిష్యులకి చాలా గౌరవం ఉందని చెప్పారు ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ అసోసియేషన్ భవన్ లో అస్ట్రో ఫౌండేషన్ జే కె ఆర్ ఇంజనీరింగ్ ఇన్ స్ట్యూట్ వారి 8వ వార్షికోత్సవం కార్యక్రమంలో మంత్రి హరీష్‌ రావు పాల్గోన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రహాలు జాతకలు అన్ని చూసి వర్తమాన ,భూత భవిష్యత్తు , కాలాలను తెలియ జేసే వారు అస్ట్రాలాజిలన్నారు. వైద్యులు మాత్రం రోగికి తక్షణం ఉపశమనం కలిగిస్తారు.. కానీ ఆస్ట్రాలజి జరిగే చెడు ను భవిష్యత్తును తెలియ పరుస్తారని చెప్పారు.

దానికి అనుగుణంగా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాజుల పరిపాలన లో వారి ఆస్థానాల్లో జ్యోతిష పండితులు ఉండేవారు వారు జ్యోతిష్యం తెలిపేవారు ..నాడు అస్ట్రాలాజి జ్యోతిష్యులని ఎంతో గౌరవించే వారన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు చేయలేని పనిని మీలాంటి పండితులు బాగా చేయగలుగుతారు. ఏ సమాజం అయిన ఎదగాలి అంటే మనుష్యులలో ఒక నమ్మకం విశ్వాసం ఉండాలి. అస్ట్రాలజి పై పెద్ద ఎత్తున రీసెర్చ్ జరుగుతుందన్నారు. మనిషికి బ్యాడ్ టైం ఉన్నప్పుడు మనిషి లో ఆత్మ విశ్వసాం నింపేందుకు అస్ట్రాలజీ పండితులు సహాయం చేస్తారన్నారు.

- Advertisement -