కేసీఆర్‌ను చూస్తే ఢిల్లీ పార్టీలకు వణుకు..

600
- Advertisement -

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది.హుజూర్‌నగర్ ప్రచారంలో టీఆర్ఎస్‌ పార్టీ దూసుకెళ్తోంది… సూర్యాపేట జిల్లా గరేడేపల్లి మండలంలోని వెలదండ గ్రామంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జగదీష్ రెడ్డి,ఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి పాల్గొన్నారు.

ఈ గ్రామంలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను చూస్తేనే ఢిల్లీ పార్టీలకు వణుకు వస్తున్నది. అందుకే హుజూర్‌నగర్ ఎన్నికల్లో సిద్ధాంతాలను వదిలి పెట్టి కాంగ్రెస్, బీజేపీ లు వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు. అయిన బీజేపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నరు. బీజేపీ ,కాంగ్రెస్ లు అధికారులను బెదిరిస్తూ,బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మంత్రి అన్నారు.

jagadeesh

హుజూర్‌నగర్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉత్తమ్‌కి లేదు. హుజూర్‌నగర్‌ను వెనుకబాటుకు గురి చేసిన ఉత్తమ్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.ఉత్తమ్ ఎన్ని వేషాలు, డ్రామాలు వేసిన హుజూర్‌నగర్‌లో గెలుపు టీఆర్‌ఎస్ పార్టీదే. అభివృద్ధి, సక్షేమంలో తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు సీఎం కేసీఆర్. నేడు దేశమంతా సీఎం కేసీఆర్ నమూనాను, దార్శనికతను ఫాలో అవుతున్నాయని మంత్రి జగదీష్‌ రెడ్డి తెలిపారు.

ఉప ఎన్నిక ఇంచార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్‌నగర్ ఎన్నికల్లో ఉత్తమ్‌కు ఘోర పరాజయం తప్పదు. ఎందుకంటే హుజూర్‌నగర్ ప్రజలు అభివృద్ధి ని కోరుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటమి భయంతో అధికారులను, ప్రజలను బెదిరిస్తున్నాడు అని పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు.

- Advertisement -