మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. గతంలో ఎంతో మందిని ఆపదలో ఉన్నామని, తమను ఆదుకోవాలని పలువురు మంత్రి కేటీఆర్‌ను సంప్రదించగా మానవతా దృక్పథంతో వారికి సహాయాన్ని అందించారు. అలాగే మంత్రి కేటీఆర్ తాజాగా ఓ స్వచ్ఛంద సంస్థకు అండగా నిలిచారు. చిన్నారులు, మహిళలకు సాంఘిక దురాచారాల నుంచి విముక్తి కల్పిస్తుంది ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ.
అయితే ఈ సంస్థకు చెందిన వాహనం రెండువారాల క్రితం చెడిపోయిందని.. దాతలు సాయంచేయాలని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు సునీతాకృష్ణన్ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్‌పెట్టారు. అనుషారెడ్డి అనే నెటిజెన్ దీనిని స్క్రీన్‌షాట్ తీసి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌చేశారు.
దీనిపై స్పందించిన కేటీఆర్.. మంగళవారం తన కార్యాలయంలో సునీత కోరినట్టుగా వాహనం కొనుగోలుకు అవసరమైన సొమ్మును చెక్ రూపంలో అందించారు.దీనిపై ఆమె ట్విట్టర్‌లో స్పందిస్తూ.. తక్షణం స్పందించే యువ నాయకత్వం ఉండటం తెలంగాణకు రక్ష.. కేటీఆర్‌కు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.
Delighted to be of some help; it’s a personal contribution to the amazing work you & your team do Sunitha Garu https://t.co/517Hq7mzov
— KTR (@KTRTRS) October 1, 2019