సీనియర్ సిటిజన్ వెబ్ సైట్ ప్రారంభం..

546
koppula eshwar
- Advertisement -

వికలాంగుల,వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించగా సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జగదీష్,ఎమ్మెల్యే కోరుకంటి చందర్,హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, సీపీఐ నేత నారాయణ,వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.

వృద్ధుల దినోత్సవం ను ఎంతో ఘనంగా నిర్వస్తున్నాం అని తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్. అనేక మంది వృద్ధులు కనీస అవసరాలు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పెద్డ మనస్సు తో అదుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది…ప్రతి కార్యక్రమం అమలు చేస్తాం అన్నారు.

12 లక్షల 94 వేల మందికి 2 వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వృద్ధులకు చట్టాలు తెలియవు కాబట్టి వాళ్ళ కోసం డివిజన్ లలో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే రాష్ట్రంలో కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు భరోసా ధైర్యం ఇస్తామన్నారు కొప్పుల.జిల్లా స్థాయిలో ఓల్డేజ్ హోమ్ నిర్మాణాలు చేపడుతాం..బస్ పాస్ లో రాయితీపై మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీనియర్ సిటిజన్‌ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు కొప్పుల.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవంను ఘనంగ జరువుతున్నామని చెప్పారు వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ. వయోవృద్ధుల కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం..జిల్లాలో ట్రిబ్యునల్ లను ఏర్పాటు చేశామని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కి,మంత్రి కొప్పుల ఈశ్వర్ కు అభినందనలు తెలిపారు సీపీఐ నారాయణ. టీఆర్‌ఎస్ పార్టీ తో మాకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి..వృద్ధులకు మానం గౌరవం ఇవ్వాలి, అందుకే తాము సీఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాం అందులో ఎంతో మంది ప్రముఖ వృద్ధులు ఉన్నారని చెప్పారు. భారత దేశంలోనే నెంబర్ వన్ ఓల్డేజ్ హోమ్ సీఆర్ ఓల్డేజ్ హోమ్ …. ప్రతి నియోజకవర్గంలో ఒక్క ఓల్డేజ్ హోమ్ నిర్మించాలి దాన్ని ప్రతి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నడిపించాలన్నారు.

సమాజం అంత కూడా పూజించేది పెద్దలను మాత్రమేనని తెలిపారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. కొన్ని కుటుంబాలు పెద్దలకు గౌరవం ఇవ్వడం లేదు…సీఎం కేసీఆర్ వృద్ధులకు పెన్షన్ ను రెండు వేల రూపాయలు ఇస్తున్నారని చెప్పారు. మనస్సున్న మహా రాజు సీఎం కేసీఆర్ వృద్ధులను గుర్తించి వారికి ఆసరాగా ఉంటున్నారని చెప్పారు. వారు కూడా కేసీఆర్ ను పెద్ద కొడుకు లాగా చూస్తున్నారు…సింగరేణి కార్మికుల కోసమే తాము పోరాటం చేశామని చెప్పారు.

- Advertisement -