చరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 1

242
Today in history
- Advertisement -

డిసెంబర్ 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 335వ రోజు (లీపు సంవత్సరములో 336వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 30 రోజులు మిగిలినవి.

*సంఘటనలు*

1963: నాగాలాండ్ భారతదేశానికి 16 వ రాష్ట్రంగా అవతరించింది.
1965: భారతదేశంలో సరిహద్దు భద్రతా దళం ప్రారంభింపబడింది.
1965: తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి ప్రారంభం.
2006: 15వ ఆసియా క్రీడలు దోహాలో ప్రారంభమయ్యాయి.

*జననాలు*

1699: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి (మ.1719).
1908: నార్ల వేంకటేశ్వరరావు, ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపాదకుడు జనన (మ.1985).
1918: జెట్టి ఈశ్వరీబాయి, భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త. (మ.1991)
1954: మేధా పాట్కర్, నర్మదా బచావో ఉద్యమంతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి.
1944: డి.ఎస్.ఎన్. మూర్తి, రంగస్థల నటుడు, దర్శకుడు, అభినయ అధ్యాపకుడు.
1980: ముహమ్మద్ కైఫ్, భారత క్రికెట్ క్రీడాకారుడు.

*మరణాలు*

1995: మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (జ.1947)

*పండుగలు మరియు జాతీయ దినాలు*

? ప్రపంచ ఎయిడ్స్ దినం.
?నాగాలాండ్ దినోత్సవం.
?సరిహద్దు భద్రతా దళ ఏర్పాటు దినోత్సవం.

- Advertisement -