హుజుర్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపు ఖాయమని మంత్రి జగదీశ్ రెడ్డి జోస్యం చెప్పారు. సైదిరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య హాజరుకాగా ఈ సందర్భంగా మాట్లాడిన జగదీశ్ రెడ్డి..ఈ ఎన్నికలు హుజుర్నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చాయన్నారు.
టీఆర్ఎస్కు ఓటేస్తే హుజుర్నగర్ ప్రజలకు లాభం…. కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుటుంబానికి లాభం అన్నారు. హుజుర్నగర్లో ఎక్కడ చూసినా ప్రజలంతా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారని చెప్పారు. హుజుర్నగర్ ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు……ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవుల కోసం ఆంధ్ర నాయకుల వద్ద మొకరిల్లి.. ఈ ప్రాంతాన్ని అధోగతి పలు జేసిండ్రన్నారు.
హుజుర్నగర్ లో చివరి భూములకు నీళ్లిచ్చిన ఘనత టీఆర్ఎస్ది…రైతులు అంతా కేసీఆర్పై ప్రేమతో ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్కే ఓటేస్తామని ఘంటాపథంగా చెబుతున్నారని వెల్లడించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రజా సమస్యలు పట్టవు… కేవలం పదవులు మాత్రమే కావాలని మండిపడ్డారు. ఈ సారి ఉత్తమ్ కు గుణపాఠం తప్పదు……..సైదిరెడ్డి యువకుడు.. స్థానికుడు ఆయన గెలుపు ఖాయమన్నారు.
టీఆర్ఎస్ గెలిస్తే హుజుర్నగర్ ప్రజలకు లాభమని తెలిపారు టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి. ప్రచారానికి పోతుంటే ఊళ్లకు ఊళ్ళు టీఆర్ఎస్కే జై కొడుతున్నాయి……అభివృద్ధి కి ఆమడ దూరంలో ఉన్న హుజుర్నగర్ బాగు కోసమే ఈ ఎన్నికలు వచ్చాయన్నారు.కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుటుంబానికి లాభం…….ప్రజలంతా ఇదే విషయాన్ని చెబుతున్నారన్నారు.