హెచ్‌సీఏ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అజార్..

575
azaruddin
- Advertisement -

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు అజారుద్దీన్. సోమవారం తన ప్యానెల్ సభ్యులతో కలిసి బాధ్యతలు చేపట్టారు. అజార్‌తో పాటు వైస్‌ ప్రెసిడెంట్‌గా జాన్‌ మనోజ్‌, సెక్రటరీగా విజయానంద్‌. జాయింట్‌ సెక్రటరీ నరేశ్‌ శర్మ, ట్రెజరర్‌గా సురేంద్ర కుమార్‌ అగర్వాల్‌, కౌన్సిలర్‌గా అనురాధలు తమ బాధ్యతలను స్వీకరించారు.

మాజీ అధ్యక్షుడు వివేక్ సపోర్ట్ చేసిన ప్రెసిడెంట్ అభ్యర్థి ప్రకాశ్‌చంద్ జైన్‌ పై అజార్ గెలుపొందారు. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసి భంగపడ్డ ఆయన ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం అందుకున్నారు. హెచ్‌సీఏ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు అజార్‌.

- Advertisement -