వరంగల్ అభివృద్ధికై మాస్టార్ ప్లాన్- వినయ్ భాస్కర్

532
Vinay Bhaskar
- Advertisement -

అక్టోబర్ 5 తేదీన వరంగల్ అర్బన్ జిల్లాలో మంత్రి,టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ పెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఛీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతో వినయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ.. అక్టోబర్ 5 తేదీన వరంగల్ అర్బన్ జిల్లాకు కేటీఆర్ రానున్నారు. ఆయన జిల్లాలోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది.

జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం మాస్టార్ ప్లాన్ తయారు చేశాము. 5 తేదీన మాస్టర్ ప్లాన్‌ను మంత్రి కేటీఆర్ విడుదల చేస్తారు. మాస్టర్ ప్లాన్ ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం కల్పించాము. కూడా ఆధ్వర్యంలో పలు జంక్షన్ లను అభివృద్ధి చేశాం. 76 ఎకరాల్లో రాంపూర్‌లో మోడల్ పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతోందని ప్రభుత్వ ఛీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.

మంత్రి కేటీఆర్ ప్రారంభించే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు..

-శిల్ప రామమం ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు.
-భద్రకాళి ట్యాంక్ బాండ్ ప్రారంభిస్తారు.
-ఔటర్ 13 కిలోమీటర్ల రింగ్ రోడ్డు పనులు ప్రారంభం
-ఆర్ ఓ బి పనులు ప్రారంభం
-కూడా అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

- Advertisement -