గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి మాదాపూర్ లో ట్రాఫిక్ స్తంభించింది.
ఐటి ఉద్యోగులు ఉదయం కార్యాలయాలకు బయలు దేరడంతో మాదాపూర్ జుబ్లీహిల్స్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
మరోవైపు జేన్టీయూ నుండి హైటెక్ సిటీ మార్గంలోను ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం కావడంతో ప్రయాణానికి దాదాపు గంటల సమయం పడుతుంది…
హైటెక్ సిటి రైల్వే అండర్ పాస్, మరియు లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి లలోకి భారీగా వరదనీరు చేరడంటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..
ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాల నిర్వాసితులకు బొటు ద్వారా పాలు, బిస్కట్ ప్యాకెట్ లను అందచేస్తోంది జీహెచ్ ఎంసీ సిబ్బంది. ఆనంద్ బాగ్ లో జలమయమైన కాలనీల నుండి ప్రజలను సురక్షితంగా ప్రత్యేక బొట్ల ద్వారా జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్క్యూ బృందాలు తరలిస్తున్నాయి.