జలమండలి ప్రాజెక్టులపై కేటీఆర్ రివ్యూ..

497
ktr
- Advertisement -

జలమండలి ప్రాజెక్టులపై మంత్రి కేటీఆర్ ఇవాళ రివ్యూ నిర్వహించనున్నారు. జలమండలి ఎండీ దానకిశోర్, ఉన్నతాధికారులతో సమావేశం కానున్న గ్రేటర్ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు.

రూ.1900 కోట్లతో చేపట్టిన హడ్కో ప్రాజెక్టు, ఔటర్ లోపల 190 గ్రామాలకు సమృద్ధిగా నీరందించేందుకు రూ.756 కోట్లతో తాగునీటి పథకం పూర్తి లక్ష్యాలను పరిశీలించనున్నారు.

ఓఆర్‌ఆర్ ఫేజ్-2 కింద రూ. 586 కోట్ల ప్రాజెక్టు, పాతనగరంలో సీవరేజీ, తాగునీటి వ్యవస్థ మరింత బలోపేతం కోసం రూ.540కోట్ల ప్రాజెక్టు, దేవులమ్మనాగారం వద్ద రూ.5093 కోట్ల ప్రతిపాదిత భారీ రిజర్వాయర్ ప్రాజెక్టుపై చర్చకు రానున్నాయి. ఈ మేరకు జలమండలి సమగ్ర నివేదికలతో సమావేశానికి సిద్ధమయ్యారు.

హుస్సేన్‌సాగర్ నాలా వెంబడి 10ఎస్టీపీల ప్రతిపాదన కార్యరూపంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ముత్తంగి జంక్షన్ నుంచి వెలిమల జంక్షన్ వరకు రూ.152 కోట్లతో గోదావరి జలాల మళ్లింపు పనులు, కృష్ణా-గోదావరి జలాల అనుసంధానం చేస్తూ ఔటర్ చుట్టూ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు, గ్రేటర్ హైదరాబాద్ తాగునీటికి శాశ్వత ప్రాజెక్టుగా ప్రభుత్వం రూ.4396.16 కోట్లతో నిర్మించ తలపెట్టిన కేశవాపూర్ రిజర్వాయర్ పనులు, భూ సేకరణపై మంత్రి కేటీఆర్ చర్చించనున్నారు.

- Advertisement -