ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద

404
Kp Vivekanadn
- Advertisement -

సుచిత్రలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. నియోజకవర్గ ప్రజలు నిత్యం విష జ్వరాలతో బాధపడుతుండటంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సుచిత్ర చౌరస్తాలోని రష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం డా. నవీన్ రెడ్డి, డా. భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పది రోజలు ఈ ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు.

kp

ఈ హెల్త్ క్యాంప్ ప్రతి రోజు మధ్యాహ్నం 12గంటల నుంచి 2గంటల వరకు అందుబాటులో ఉండనుంది. పది రోజుల పాటు నిర్వహించే ఈ ఉచిత మెడికల్ క్యాంప్ ను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆసుపత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -