హరీశ్‌కు బాసటగా వంశీ పైడిపల్లి

615
vamshi harish shankar
- Advertisement -

వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గద్దలకొండ గణేశ్‌. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ టైటిల్‌ని ఒకరోజు ముందుమార్చిన సంగతి తెలిసిందే. తొలుత వాల్మీకి అనే టైటిల్‌ని ఖరారు చేయగా వాల్మీకి,బోయ కులస్తుల అభ్యంతరాలతో సినిమా టైటిల్‌ని మార్చారు. దీంతో భావోద్వేగానికి గురయ్యారు హరీశ్‌ శంకర్‌.

ఇలాంటి బాధలు ఏ దర్శకుడు పడకూడదని హరీశ్‌కి బాసటగా నిలిచారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఇది చాలా బాధాకరం. ఏ దర్శకుడు, సినిమా ఇలాంటి బాధలు పడటానికి అర్హులు కాదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. హరీశ్ మేమంతా మీతో ఉన్నాం…. సినిమా పట్ల మీకు ఎంతటి కమిట్‌మెంట్ ఉందో మా అందరికీ తెలుసు. గద్దలకొండ గణేశ్ తప్పకుండా విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.

మరోవైపు సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రీమియర్ షోలు చూసిన నెటిజన్లు వరుణ్ తేజ్,హరీష్ శంకర్‌లపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. గద్దలకొండ గణేశ్‌గా వరుణ్‌ ఇరగదీశాడని…హరీశ్‌ శంకర్ దర్శకత్వం సూపర్బ్ అని ట్వీట్లు చేస్తున్నారు.

- Advertisement -