రామ్‌చరణ్‌..ఇన్‌స్టా @ 1 మిలియన్

598
ram charan
- Advertisement -

ఈ మద్య ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవాలంటే రాజకీయ నాయకులు,సినిమా స్టార్లు ఎక్కువ శాతం సోషల్ మీడియానే ఫాలో అవుతున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్ స్ట్రాగామ్ ద్వారా అభిమానులతో నేరుగా కనెక్ట్ అవుతున్నారు. అయితే లేటుగానైనా లెటెస్టుగా ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొద్దిరోజుల్లోనే మిలియన్ ఫాలోయర్స్‌ను సొంతం చేసుకున్నారు.

టాలీవుడ్,కోలీవుడ్, మాలీవుడ్,బాలీవుడ్ లో ఉన్న రామ్‌చరణ్ క్రేజ్ కి ఇన్ స్ట్రాగామ్ లో రానున్న రోజుల్లో మరింత ఫాలోవర్స్ పెరిగిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదని ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రామ్‌ చరణ్….రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ చేస్తున్నారు. ఈ సినిమా 2020లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగాను రాణిస్తున్నాడు చెర్రీ. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా మూవీని నిర్మించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -