సీఎం కేసీఆర్ శభాష్ అనేలా పని చేస్తా..

595
puvvada ajay
- Advertisement -

ఇటీవల సీఎం కేసీఆర్ రెండోసారి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేసిన విషయం తెలిసిందే. ఈ మంత్రి వర్గంలో పలువురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి వరించింది. ఇక ఖమ్మం జిల్లా నుండి ఎమ్మెల్యే పూవ్వాడ అజయ్‌ కుమార్‌కు మంత్రి పదవి దక్కింది. ఆయన రవాణా శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు టీఆర్ఎస్ పార్టీ తరపున స్వాగత సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు హరిప్రియ, రాములు నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి, ఇతర జిల్లా నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌కు ఏ రాజకీయ పార్టీ ఎదురు లేకుండా చేస్తాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌కు గుమ్మం అని గత ఎన్నికల్లో ప్రజలు నిరూపించారు.ఖమ్మం జిల్లాకు మంత్రిపదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతజ్ఞతలు అని ఎంపీ నామ తెలిపారు.

మంత్రి అజయ్ కుమార్‌కి కుడి భుజంలా ఉండి ఉమ్మడి జిల్లాను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మూడు ముఖ్యమైన పదవులు రావడం చాలా గొప్ప విషయం. జిల్లాకు మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్‌కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుణపడి ఉండాలి అన్నారు.

Minister Puvvada Ajay Kumar

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో అందరినీ కలుపుకొని టీఆర్ఎస్‌ను ముందుకు తీసుకెళ్తా.నాకు మంత్రివర్గంలో స్థానంలో కల్పించిన సీఎం కేసీఆర్, కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను మంత్రి కావాలని ఆకాంక్షించిన ఖమ్మం జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు అని మంత్రి అన్నారు. నేను పుట్టిన భద్రాద్రి జిల్లా, నన్ను ఆదరించిన ఖమ్మం జిల్లా ప్రజల శ్రేయస్సే లక్ష్యం గా పనిచేస్తాను.ప్రతీ పేదవాడు తానే మంత్రి అయ్యానని అనుకునేల పనిచేస్తాను.

అందరినీ కలుపుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా.ఖమ్మం నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేను వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ఆపొద్దని ట్రాఫిక్ పోలీస్‌లకు విజ్ఞప్తి చేస్తున్నాను.నాకు ప్రజలు ఇచ్చిన బాధ్యతల్ని జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తానని మంత్రి అజయ్‌ కుమార్‌ తెలిపారు.

కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చకుంటాను. ఖమ్మం ఓటర్ల ఆశీర్వాదం వల్లే నాకు మంత్రి పదవి దక్కింది.ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ది కోసం పాటుపడతాను.కేసీఆర్ గారి చేత శభాష్ అనిపించుకునేలా పని చేస్తానని ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌ పేర్కొన్నారు.

- Advertisement -