విశాఖలో పర్యటించిన మంత్రి నిరంజన్ రెడ్డి..

342

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం విశాఖపట్నంలో పర్యటించారు. మంత్రితో పాటు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధి కూడా ఉన్నారు. యూరియా సరఫరా విషయంలో ఒక క్షణం కూడా వృధా కానివ్వం.. పలు ప్రాంతాల నుండి యూరియా రవాణా చేయడానికి రోడ్డు, రైల్వే అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నాం.కేసీఆర్ నాయకత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అందరికీ యూరియా అందిస్తాము. రబీకి కావల్సిన యూరియా నిల్వలు సిద్దం చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

Minister Singireddy Niranjan Reddy

ఇప్పటి వరకు గత వారం రోజులలో అన్ని పోర్టుల నుండి ఎన్ఎఫ్ఎల్ యూరియా 20,387 వేల మెట్రిక్ టన్నుల సరఫరా, విశాఖ నుండి 6800 మెట్రిక్ టన్నులు సరఫరా చేశాము. ఐపీఎల్ యూరియా 15 వేల మెట్రిక్ టన్నులు సరఫరా అయింది. 2600 మెట్రిక్ టన్నులకు అదనంగా మరో 2600 మెట్రిక్ టన్నులు కలిపి రేపటి నుండి రోజుకు 5,200 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు నిర్ణయం తీసుకున్నాము. యూరియా సత్వర రవాణాకు పోర్టు నుండి సంపూర్ణ సహకారం ఉంటుందని గంగవరం పోర్టు సీఈఓ, ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు హామీ ఇచ్చారు. వారికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Minister Singireddy Niranjan Reddy

గంగవరం పోర్టులో యూరియా సత్వర రవాణాకు పోర్టు అధికారులు, తెలంగాణ నుండి వచ్చిన ప్రత్యేక అధికారులతో సమావేశం అయ్యారు. అనంతరం గంగవరం పోర్టులో వియత్నాం నుండి వచ్చిన యూరియా నౌక వారు సందర్శించారు. తెలంగాణకు సరఫరా చేసేందుకు సిద్దమవుతున్న యూరియా గోడౌన్, వ్యాగన్‌లను పరిశీలించారు. శ్రావణి గోడౌన్స్ లో ఎన్ఎఫ్ఎల్ యూరియా ప్లాంట్, క్రిబ్ కో ప్లాంట్, రైల్వే వ్యాగన్ లోకి లోడ్ అవుతున్న చోట్లకు వెళ్లి తెలంగాణకు యూరియా సరఫరా చేసేందుకు సహకరించాలని కార్మికులు, రవాణాదారులకు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే మూడు షిప్టులలో పనిచేయాలని కోరగా సహకరిస్తామని చెప్పిన కార్మికులు తెలిపారు.

Minister Singireddy Niranjan Reddy

విదేశాల నుండి కేంద్రం ఎరువులు తెప్పిస్తుంది. అక్కడ లోడింగ్, అక్కడి నుండి ఇక్కడికి రావడం, ఇక్కడ అన్ లోడింగ్ చేయడానికి పూర్తిగా వాతావరణం సహకరించాలి.ఏ మాత్రం చినుకు రాలినా ఓడల నుండి యూరియా తీయడం కుదరదు. యూరియా ప్లాంటుకు వెళ్లి ప్యాకింగ్ అయి వ్యాగన్లలో లోడ్ అయ్యే వరకు ఇబ్బందులే.. విదేశాల నుండి వచ్చే యూరియా సరఫరాకు ఇబ్బందుల మూలంగానే ఈసారి కొంచెం ఆలస్యమయిందని మంత్రి అన్నారు. అన్నింటినీ అధిగమించి ఎక్కడా యూరియా కొరత లేకుండా చేశాం.యూరియా సరఫరాకు సహకరిస్తున్న పోర్టు, రైల్వే, ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు.కేసీఆర్ అదేశాల మేరకు క్షేత్రస్థాయి నుండి యూరియా సరఫరా, పంపిణీపై నిఘా ఉంచామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.