కాంగ్రెస్‌పై ఎర్రబెల్లి ధ్వజం…

354
errabelli dayakar rao

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదని మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పెద్దపల్లి జిల్లా మంథని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్మెన్ పుట్ట మధుతో కలసి మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి …9 గంటల కరెంటు ఇస్తానని కనీసం 7 గంటలు ఇవ్వలేదన్నారు.

రైతులకు 24 కరెంటు ఇచ్చిన సిఎం కేసీఆర్ దేవుడు కాదా అని ప్రశ్నించారు. రైతుల కోసం సిఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడి రెవిన్యూ వ్యవస్థ ను బాగు చేశాడని చెప్పారు. రైతులకు పెట్టుబడికి ఎకరాకు 5 వేలు ఇచ్చిండని చెప్పారు.

అధికారంలో ఉన్నప్పుడు ఏరాష్ట్రంలోనైన ఒక్క రూపాయి ఇచ్చారా…యూరియా కోసం రైతు లు చెప్పులు లైన్ లో పెట్టుకొన్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయని చెప్పారు.సిగ్గులేకుండ ఇంకా ధర్నా లు చేస్తున్నారు. ఇప్పటికైన బుద్ధి తెచ్చుకొని ఒక సారీ 30 రోజు ప్రణాళికను చూడండని చెప్పారు. మీ స్వార్థం కోసం.. మీ ఉనికీ కోసం రాజకీయాలు చేయకండి. ప్రజలకోసం చేయండని సూచించారు ఎర్రబెల్లి.