లెక్కలోలేని ఆదాయంపై 73 శాతం పన్ను..

221
- Advertisement -

పెద్దనోట్ల రద్దు అంశంపై సోమవారం రాజ్యసభ అట్టుడికింది. ఈ అంశంపై చర్చ చేపట్టాల్సిందేనని.. ప్రధాని సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని విపక్ష పార్టీలన్నీ డిమాండ్‌ చేపట్టాయి. సభ ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలన్నీ సభ కార్యకలాపాలకు అడ్డుతగిలాయి. ఈ క్రమంలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇన్‌కం టాక్స్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం లెక్కచూపని ఆదాయానికి 30 శాతం పన్ను విధించనుంది కేంద్రం. పదిశాతం పన్నుతో పాటు 30 శాతం సర్‌చార్జీ విధించనుంది. పన్ను, పెనాల్టీ, సర్‌చార్జీ కలిపితే లెక్కలో చూపని ఆదాయానికి మొత్తంగా 73 శాతం పన్ను పడనుంది. ఇలా అదనంగా వచ్చిన ఆదాయాన్ని ప్రధానమంత్రి గరీబ్ యోజనకు మళ్లించనుంది కేంద్రం.

పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత నిర్ణీత పరిమితికి మించి బ్యాంకుల్లో జరుగుతున్న ఇలాంటి డిపాజిట్లపై 73% మేర ఆదాయపు పన్ను విధించబోతున్నారు. ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టానికి సవరణలు చేయాలని కేంద్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించారు. ఐటీశాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక్కో ఖాతాలో రూ.2.5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ న‌గ‌దు ఉంటే ఆ వివరాల‌ను వెల్ల‌డించాల్సి ఉంటుంద‌ని, ప్ర‌ధాన‌మంత్రి జ‌న్‌ధ‌న్ యోజ‌న ఖాతాల్లో రూ.50 వేల వ‌ర‌కు జ‌మ‌చేసుకోవ‌చ్చ‌ని పేర్కోంది.

ప్రధాని సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని పలువురు సభ్యులు ఛైర్మన్‌ పోడియాన్ని చుట్టుముట్టి పెద్దయెత్తున నినాదాలు చేశారు. పరిస్థితి సద్దుమణిగే అవకాశం కనిపించకపోవడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ ప్రకటించారు.

- Advertisement -