ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఘనంగా టెక్నెక్స్ 2019

520
Dps
- Advertisement -

నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో టెక్నెక్స్ 2019 సంబరాలు ఘనంగా ముగిసాయి. డీపీఎస్ చైర్మన్ ఎం. కొమురయ్య , డైరెక్టర్ ఎంఎస్ ఎం. పల్లవి ఆధ్వర్యంలో ఈకార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె జోషి హాజరయ్యారు. ఇవాళ విద్యార్దులు చేపట్టిన ప్రదర్శనను తిలకించడానికి జంట నగరాలలోని 20ఉన్నత పాఠశాలల నుంచి వందలాది మంది విద్యార్దులు వచ్చారు. ఇక్కడికి రావడం ఇస్రో కారిడార్లు మరియు నాసా మ్యూజియం గుండా ప్రయాణం సాగినట్లుంది విద్యార్దులు తల్లితండ్రులు తెలిపారు.

Dps 2

ఇవాళ జరిగిన ముగింపు ఉత్సవాల్లో గ్రీన్ స్క్రీన్ యాక్షన్, స్కూల్ విదర్, ఏరోమోడెలింగ్, రోబోటిక్స్, సౌండ్ టు ఎలక్ట్రీకల్ ఎనర్జీ, సోలార్ పవర్ ట్రాకర్ మరియు వెబ్ డిజైనింగ్ వంటి 46 ఉత్తమ ప్రాజెక్టులకు ప్రత్యేక అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించినందుకు కంప్యూటర్ సైన్స్ విభాగ అధిపతి సుభాష్ చంద్రబోస్ ను అభినందించారు.

టీం సభ్యుల కృషితోనే ఇది సాధ్యమైందన్నారు వైస్ ప్రిన్సిపల్ నందిత సుంకర, విద్యార్దులు వారి ప్రతిభను అన్వేషించడానికి, పరిశోధన మొక్క ప్రాధమిక స్దాయిలను అర్ధం చేసుకోవడానికి, దానిని అచరణలో పెట్టడానికి మరియు వారి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది ఒక అద్భుతమైన వేదికగా నిలిచిందన్నారు.

- Advertisement -