- Advertisement -
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వాల సంఖ్య 60 లక్షలకు చేరుకుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించిన కేటీఆర్ నేటితో పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం పూర్తయిందన్నారు.
తెలంగాణలో టీఆర్‌ఎస్ కంటే బలమైన పార్టీ ఏదీ లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. భారీగా సభ్యత్వాల నమోదుకు కృషి చేసిన అందరికీ అభినందనలు. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో గజ్వేల్, వర్ధన్నపేట ముందు వరుసలో నిలిచాయని చెప్పారు.
దసరా పండుగకు పార్టీ కార్యాలయాలు ప్రారంభించాలని నేతలకు సూచించారు. ఈ నెల చివరి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి 12 లక్షల సభ్యత్వాలు మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ నేతల మాటలు వింటుంటే విడ్డూరంగా ఉందన్నారు.
- Advertisement -