మిషన్ భగీరథ ఇంజనీర్లకు వర్క్ షాప్

345
Mission-Bhagiratha
- Advertisement -

మిషన్ భగీరథ లో నీటి వివాదాలు, ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారాలపై ఇంజనీర్లకు హైదరాబాద్ లోని ఎర్రమంజీల్ లో రెండు రోజుల వర్క్ షాప్   నిర్వహించారు .ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్ నేటివ్  డిస్ప్యూట్ రిసోల్యూషన్ ఆధ్వర్యంలో ఆర్ డబ్ల్యు ఎస్ కార్యాలయంలో ఈ వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కు ముఖ్యఅతిధిగా కేంద్ర ఇంచార్జ్ కార్యదర్శి జే.ఎల్.ఎన్ మూర్తి, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కృపకర్ రెడ్డి , చీఫ్ ఇంజనీర్ వినోభా దేవి, ఇతర ఇంజనీర్స్ పాల్గోన్నారు.

ఈసందర్భంగా మిషన్ భగీరథ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కృపకర్ రెడ్డి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ఇంజనీర్లకు రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించాం. మా ఇంజనీర్లకు ఇంజనీరింగ్ టెక్నాలజీ తెలుసు కానీ జ్యూడిషియల్ వ్యవస్ద తెలిదన్నారు. అందుకోసం ఈ వర్క్ షాప్ చాలా ఉపయోగపడుతుందన్నారు. మిషన్ భగీరథలో చాలా మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు..వారికి ఇది చాలా ఉపయోగపడుతుందన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో ఎమైనా వివాదాలు ఉంటే పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. కోర్టుకు వెళ్లకుండా కాంటాక్ట్ వ్యవస్ధలో రోజురోజుకు వచ్చే మార్పులు, లీగల్ ఇష్యులు ఏమైనా ఉంటే తెలుసుకుని మన ఆధ్వర్యంలో వివాదాలు పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు.

- Advertisement -