- Advertisement -
మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు ఎయిమ్స్ డాక్టర్లు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిపాలైన జైట్లీ నిపుణులైన డాక్టర్ల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
జైట్లీకి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని వివరించారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో కుటుంబసభ్యులు ఎయిమ్స్‌లో చేర్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాస్పిటల్‌కు వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గత కొన్నిరోజులుగా కిడ్నీ, గుండె సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.
- Advertisement -