జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లుపై రాజ్యసభలో గొడవ జరుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాద ప్రకటన చేశారు . జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ, రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టు అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల సభ్యులు తీవ్ర నిరసనలు తెలుపుతున్న వేళ, అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టగా, దీనిపై చర్చ చేపడతామని చైర్మన్ వెంకయ్యనాయుడు వెల్లడించారు.
ఈ సమయంలో విపక్ష సభ్యులు పొడియం వద్దకు చేరుకుని నిరసనలు తెలపుతున్నారు. రాజ్యసభలో ప్రకటన వెలువడటం దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపడం, గెజిట్‌లో ప్రచురించడం అంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోయింది. దీంతో కాసేపు సభ అరుపులతో దద్దరిల్లిపోయింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని కోల్పోయింది. ఇప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ లో కూడా రాజ్యాంగం అమలు కానుంది. జమ్మూ కాశ్మీర్ పై కేంద్రానికి సర్వ అధికారాలు ఉండనున్నాయి.
ఈసందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ ను భౌగోళికంగా సవరించాల్సిన అవసరం ఉందన్నారు . జమ్మూ, కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలకు వేర్వేలు చట్టసభలను ఏర్పాటు చేయనున్నారు.