చింతమడకలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన హరీశ్ రావు..

569
- Advertisement -

సిద్దిపేట జిల్లాలోని సీఎం కేసీఆర్‌ స్వగ్రామమైన చింతమడకలో యశోద హాస్పిటల్స్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని నేడు మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్ రావు,జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి చింతమడక నుంచి శ్రీకారం చుట్టడం ఇక్కడి ప్రజలకు గర్వ కారణం. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని హరీష్‌ రావు అన్నారు. ముఖ్యమంత్రి ఆశయాన్ని నెరవేర్చడానికి చింతమడక ప్రజలు ముందుండాలని. చింతమడకలో ఈ కార్యక్రమాన్ని చెపట్టడానికి యశోద ఆస్పత్రి వైద్యులు ముందుకు రావడం అభినందనియం అని అయన తెలిపారు.

MLA Harish Raoఈ శిబిరంలో ప్రజలకు అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేస్తారు.ప్రతి పౌరుడి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి ప్రొఫైల్‌ను అధికారులు సిద్ధం చేస్తారు.గుండె నొప్పి, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన పరీక్షలు, చికిత్సలు కూడా ఈ శిబిరం ద్వారా నిర్వహిస్తారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు కూడా చేస్తారని ఎమ్మెల్యే హరీష్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల్లో ఇటీవల బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించిన సమస్య తీవ్రమవుతున్నది. ఆ పరీక్షలు కూడా ఈ శిబిరంలో నిర్వహిస్తారని తెలిపారు.

40 ఏళ్లపై బడిన ప్రతి మహిళ కూడా పరీక్ష చేయించుకోవాలి.శిబిరంలో ఉచితంగా మందులు కూడా అందజేస్తారు. వాటిని దుర్వినియోగం చేయకుండా శ్రద్ధగా వాడుకోవాలి.శిబిరంలో చింతమడకతో పాటు సీతారాంపల్లి, మాచాపూర్, దమ్మచెరువు, అంకంపేట గ్రామాల ప్రజలకు కూడా ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పదిహేను రోజులపాటు ఈ శిబిరం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకొని శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని హరీష్‌ రావు తెలిపారు.

- Advertisement -