సింగరేణిలో ఉద్యమంలా హరిత హారం..

528
singareni haritha haram
- Advertisement -

బుధవారం ఒక్క రోజే 1 లక్ష 94 వేల మొక్కలు నాటిన సింగరేణి ..హరితహారంలో కొత్త రికార్డు సృష్టించింది. శ్రీరాంపూర్ లో 1 లక్ష 59 వేల మొక్కలు నాటారు ప్రజాప్రతినిధులు, సింగరేణి అధికారులు,పోలీసు ఉన్నతాధికారులు, కార్మికులు, విద్యార్ధిని విద్యార్ధులు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సీఎండీ శ్రీధర్ సూచనలతో కోటి మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకుసాగుతోంది సింగరేణి.

సింగరేణి తెలంగాణాకు హరితహారం కార్యక్రమంలో ఒక రికార్డుగా శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని ఇందారం గ్రామ సమీపంలోని రిజర్వు ఫారెస్టు భూముల్లో 9,886 మందితో పెద్ద ఎత్తున 1,59,876 మొక్కలు నాటి సంచలనం సృష్టించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పోలీసు, ఫారెస్టు అధికారులు, సింగరేణి అధికారులు, స్థానికులు, విద్యార్ధినీ విద్యార్ధులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం సింగరేణి చరిత్రలో తొలిసారే. పెద్ద ఉత్సవంలా జరిగిన ఈ కార్యక్రమంలో సింగరేణి నర్సరీలలో పెంచుతున్న మొక్కల్ని నాటి అందరికీ స్ఫూర్తినిచ్చారు.

telangana haritha haram

ఇందారం,టేకుమట్ల గ్రామాలకు సమీపంలో గల ఈ రిజర్వు ఫారెస్టు బ్లాకులో మొక్కలు నాటేందుకు స్థానిక గ్రామాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎం.ఎల్.ఎ. లు శ్రీ బాల్క సుమన్ (చెన్నూర్), శ్రీ దివాకర్ రావు (మంచిర్యాల), ఎం.ఎల్.సి. శ్రీ పురాణం సతీష్, జడ్పీ ఛైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మీ, రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సత్యనారాయణ, డి.సి.పి. రక్షిత కృష్ణమూర్తి, ఎ.సి.పి. శ్రీ వెంకటరెడ్డి, ఏరియా జి.ఎం. శ్రీ కె.లక్ష్మీనారాయణ, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు శ్రీ బి.వెంకట్రావు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ సురేందర్ రెడ్డి తదితరులు అతిధులుగా పాల్గొని మొక్కలు నాటారు. సింగరేణి ఉద్యోగులు, సింగరేణి పాలిటెక్నీక్ కళాశాల, సింగరేణి పాఠశాలతో పాటు అన్ని పాఠశాలల విద్యార్ధినీ విద్యార్ధులు, సేవా, లేడీస్ క్లబ్ సభ్యులు, ఎస్ & పి.సి. సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

telangana haritha haram

రామగుండం-3 ఏరియాలో 30 వేల మొక్కలు
రామగుండం-3, ఆడ్రియా లాంగ్ వాల్ ఏరియా పరిథిలో బుధవారం (జూలై 31వ తేదీ) నాడు 30 వేల మొక్కల్ని నాటారు. ఆర్.జి.-3 ఏరియా జి.ఎం. శ్రీ కె.సూర్యనారాయణ సారథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి వనజాదేవి, గుర్తింపు కార్మిక సంఘం జనరల్ స్రెకటరీ శ్రీ మిర్యాల రాజిరెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీ నాగెల్లి సాంబయ్య, అటవీ శాఖ అధికారి శ్రీ కర్ణ, పెద్ద సంఖ్యలో కార్మికులు, విద్యార్ధినీ విద్యార్ధులు, సేవా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ఆర్.జి. ఓ.సి వద్ద 10 వేల మొక్కలు, ఆర్.జి. ఓ.సి.-2 వద్ద 10 వేల మొక్కలు, జె.ఎన్.టి.యు. కళాశాల సమీపంలో మరో 10 వేల మొక్కలు నాటారు.

ఇల్లందు ఏరియాలో 5 వేల మొక్కలు
ఇల్లందు ఏరియాలో జె.కె. ఓపెన్ కాస్ట్ గనికి సమీపంలో 3 హెక్టార్లలో 5 వేల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం.ఎల్.ఎ. శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్, కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ రజత్ కుమార్ షైనీ, సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ ఎన్.బలరాం, గుర్తింపు కార్మిక సంఘం నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

telangana haritha haram

రామగుండం-2 ఏరియా పోతన కాలనీలో 5 వేల పండ్ల మొక్కలు
రామగుండం-2 ఏరియాలో గల పోతన కాలనీలో 5 హెక్టార్లలో 5 వేల పండ్ల మొక్కలను నాటే కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి వనజాదేవి ప్రారంభించారు.

కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె.నారాయణ, గుర్తింపు కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మామిడి, సపోట, జామ, పనస, నేరేడు వంటి పండ్ల జాతుల మొక్కలను నాటారు. కార్యక్రమంలో కాలనీ కార్మికులతో పాటు సేవా మరియు లేడీస్ క్లబ్ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇప్పటి వరకూ 2,167 మొక్కలు నాటిన డైరెక్టర్ ఫైనాన్స్  ఎన్.బలరాం కాగా సింగరేణి సంస్థలో డైరెక్టర్ ఫైనాన్స్గా పనిచేస్తున్న శ్రీ ఎన్.బలరాం మరోసారి స్వయంగా 216 మొక్కలను కేవలం అరగంట సమయంలోనే నాటి అందరికీ స్ఫూర్తి నందించారు. జూలై 29వ తేదీన ఆయన బంగ్లోస్ ప్రాంగణంలో 109 మొక్కలు నాటారు. కాగా జూలై 20వ తేదీన ఆయన శ్రీరాంపూర్ లో జరిగిన హరితహారంలో 1,237 మొక్కలు నాటి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సాధించారు. అలాగే అదే రోజు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 500 మొక్కలు నాటి శభాష్ అన్పించుకున్నారు. ఇప్పటి వరకూ శ్రీ ఎన్.బలరాం 2,167 మొక్కలను స్వయంగా నాటి పర్యావరణ పట్ల ఆయనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. సింగరేణి సంస్థ ఉన్నతాధికారులలో (డైరెక్టర్ల)లో ఒకరిగా ఉన్న ఆయన స్వయంగా మొక్కలు నాటడం అందరినీ ఆశ్చర్యపరచడమే కాక చక్కని స్ఫూర్తినిస్తుంది.

- Advertisement -