టిక్ టాక్ లో వీడియో చేసిన మహిళా డీఎస్పీ…ఆమె ఎవరో తెలుసా?(వీడియో)

583
Manjita-Vanzara-Video
- Advertisement -

ఈమధ్య చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుల్లో టిక్ టాక్ చేస్తు తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటివలే గుజరాత్ లోని ఓ మహిళా కానిస్టేబుల్ స్టేషన్ లో టిక్ టాక్ చేసిందని ఆమెను సస్పెండ్ చేసింది డీఎస్పీ మంజిత వంజారా. అయితే అదే డీఎస్పీ టిక్ టాక్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ పంజాబి పాటకు తమ స్నేహితురాలితో కలిసి స్టెప్పులేసింది డీఎస్పీ మంజిత. ఈవీడియో చూసిన నెటిజన్లు డీఎస్పీ మంజితా వంజారా పై మండిపడుతున్నారు.

టిక్ టాక్ చేసిందని అల్పిత అనే మహిళా కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసిన డీఎస్పీ ఇప్పుడు ఆమెనే తన స్నేహితురాలితో టిక్ టాక్ వీడియోలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. డీఎస్పీపై కూడా చర్యలు తీసుకోవాలిని డిమాండ్ చేస్తున్నారు. మహిళా కానిస్టేబుల్ సస్పెండ్ పై వివరణ ఇచ్చారు డీఎస్పీ.

తాను టిక్ టాక్ చేసినందుకు సస్పెండ్ చేయలేదని..డ్యూటీలో ఉండి యూనిఫాం ధరించనందుకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇక తాను చేసిన టిక్ టాక్ వీడియోపై కూడా ఆమె స్పందించారు. ఆ వీడియో రెండు నెలల క్రితం చేసిందని..అసలు ఆ వీడియోను తాను అప్ లోడ్ చేయలేదని చెప్పారు. తాను మంచి కూచిపూడి డ్యాన్సర్ అని డ్యూటీలో లేనప్పుడే ఇలాంటి వీడియోలు చేస్తానని చెప్పుకోచ్చారు డీఎస్పీ మంజిత వంజారా.

- Advertisement -