- Advertisement -
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో టిక్ టాక్ చేసిన ఇద్దరు విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు సూపరింటెండెంట్. టిక్ టాక్ చేసిన ఇద్దరు విద్యార్థులు ఫిజియోథెరపి ఇంటెన్‌షిప్ చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులపై చర్యలతో పాటు ఫిజియోథెరపి డిపార్ట్ మెంట్ ఇంచార్జ్ కు నోటీసులు జారీ చేశారు.
గాంధీ విద్యార్థులకు ఈ వీడియో తో సంభంధం లేదని తెలిపారు. గాంధీ సూపర్ డెంట్ వేరే కాలేజీ కి చెందిన ఇంటెన్ షిప్ విద్యార్థులు టిక్ టాక్ చేసినట్లు వెల్లడించారు.
గాంధీ ఆస్పత్రి ఫిజియో థెరపీ డిపార్టమెంట్ సిబ్బంది పేరిట టిక్ టాక్ చేసిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆస్పత్రికి వచ్చిన రోగులను పట్టించుకోకుండా టిక్ టాక్ వీడియోలు చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకున్నారు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్.
- Advertisement -