వీరజవాన్ల యాదిలో…కార్గిల్ విజయ్ దివాస్‌

1066
vijay diwas
- Advertisement -

22 ఏళ్ల క్రితం పాక్ సైన్యం భారత్‌లో చొరబడగా వారిని సమర్ధవంతంగా తిప్పికొట్టింది భారత సైన్యం. దాదాపు మూడు నెలల పాటు సాగిన కార్గిల్ పోరులో భారత జవాన్లు వీరోచిత పోరాటంతో పాక్ సైన్యాన్ని దేశం నుంచి తరిమికొట్టారు. పాక్‌తో భారీ యుద్ధం చేసిన భారత జవాన్లు జూలై 26న త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. దేశం కోసం జరిగిన ఈ యుద్ధంలో 527 మంది జవాన్లు అమరులయ్యారు. ఆ హీరోలకు సెల్యూట్‌ చేస్తూ ఆ చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకొంటున్నాం.

అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది (మొదటిది చైనా – సోవియట్ ల మధ్య 1969 లో జరిగింది).

()3 మే…కార్గిల్‌లో పాకిస్తాన్ చొరబడిందని గొర్రెల కాపరులు చెప్పారు
()5 మే…భారత సైన్యం గస్తీ దళాన్ని పంపించింది. ఐదుగురు భారతీయ సైనికులను పట్టుకుని చిత్రహింస చేసి చంపేశారు
()9 మే…పాకిస్తాన్ సైన్యం చేసిన శతఘ్ని దాడిలో కార్గిల్ ఆయుధాగారం ధ్వంసమైంది
()మే 10…ద్రాస్, కక్సార్, ముష్ఖో సెక్టార్లలో చొరబాట్లు కనుగొన్నారు
()మే మధ్యలో భారత సైన్యం కాశ్మీరులోయ నుండి మరింత మంది సైనికులను కార్గిల్ సెక్టారుకు పంపించింది.
()మే 26 ……చొరబాటుదారులపై భారత వాయుసేన దాడులు చేసింది.
()మే 27…… భారత వాయుసేన ఒక మిగ్-21 ను, ఒక మిగ్-27 ను కోల్పోయింది. ఫ్లైట్ లెఫ్టె. నచికేతను యుద్ధఖైదీగా పట్టుకున్నారు.
()మే 28….. వాయుసేనకు చెందిన ఎమ్‌ఐ-17 హెలికాప్టరును పాకిస్తాన్ కూల్చివేసింది. నలుగురు సిబ్బంది మరణించారు.
()జూన్ 1 ……పాకిస్తాన్ దాడులను ముమ్మరం చేసింది. జాతీయ రహదారి 1ఎ పై బాంబులు వేసింది.
()జూన్ 5…… ముగ్గురు పాకిస్తాన్ సైనికుల నుండి స్వాధీనం చేసుకున్న పత్రాలని భారత సైన్యం బయటపెట్టి పాకిస్తాన్ జోక్యాన్ని బయటపెట్టింది.
()జూన్ 6….. భారత సైన్యం పెద్ద ఎత్తున దాడి మొదలుపెట్టింది.
()జూన్ 9 …..బటాలిక్ సెక్టారులో రెండు కీలక స్థావరాలను భారత సైన్యం తిరిగి స్వాధీన పరచుకుంది.
()జూన్ 11…… పాకిస్తాన్ సైనిక ప్రధానాధికారి జన. పర్వేజ్ ముషారఫ్, ఛీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టె. జన. అజీజ్ ఖాన్ తో జరిపిన సంభాషణను బయటపెట్టి పాకిస్తాన్ సైన్యపు జోక్యాన్ని నిరూపించింది.
()జూన్ 13 ……ద్రాస్ సెక్టారులోని తోలోలింగ్‌ను భారత సైన్యం స్వాధీనపరచుకుంది.
()జూన్ 15……. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో టెలిఫోనులో మాట్లాడుతూ, కార్గిల్ నుండి తప్పుకోమని చెప్పాడు.
()జూన్ 29 …..భారత సైన్యం టైగర్ హిల్ వద్ద ఉన్న రెండు కీలక స్థావరాలను పాయింట్ 5060, పాయింట్ 5100 స్వాధీనపరచుకుంది
()జూలై 2 ….భారత సైన్యం త్రిముఖ దాడిని మొదలుపెట్టింది.
()జూలై 4 ……11 గంటల పోరు తరువాత, భారత సైన్యం టైగర్ హిల్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది
()జూలై 5……. భారత సైన్యం ద్రాస్‌పై నియంత్రణ సాధించింది. క్లింటన్‌తో సమావేశం తరువాత, పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కార్గిల్ నుండి వెనక్కి వెళ్తున్నట్లు ప్రకటించాడు.
()జూలై 7…. బటాలిక్ సెక్టారులోని జుబర్ హైట్స్‌ను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.
()జూలై 11….. పాకిస్తాన్ వెనక్కి వెళ్ళడం మొదలైంది. బటాలిక్‌ లోని కీలక శిఖరాలను భారత సైన్యం స్వాధీనపరచుకుంది.
()జూలై 14….. ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని భారత ప్రధాని వాజపాయి ప్రకటించాచారు. పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ షరతులు విధించింది.
()జూలై 26….. కార్గిల్ యుద్ధం అధికారికంగా ముగిసింది.

- Advertisement -