ఏపీ నూతన గవర్నర్ గా ప్రమాణం చేసిన బిశ్వభూషణ్ హరిచందన్

488
Ap New Governer
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా బిశ్వభూషన్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈరోజు ఉదయం 11.35 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమంలో బిశ్వభూషణ్‌తో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, విపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, మంత్రులు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్‌, సీజే, సీఎం జగన్‌ తేనీటి విందులో పాల్గొననున్నారు.

 

- Advertisement -